వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేతల అండతో, అధికారుల సహకారంతో నార్త్‌వల్లూరు, మద్దూరు వంటి ప్రాంతాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో అక్రమ రవాణా సాగుతోంది.
జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించినా అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అయినా, మామూళ్ల మత్తులో అధికారులు చోద్యం చూస్తుండటం గమనార్హం.
Comments
Loading comments...

