వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఎస్సై మోతీరాం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ వాహనాలను శుభ్రం చేసి, అలంకరించి పసుపు, కుంకుమలతో పూజించారు.
ప్రజలకు నిరంతరం సేవలందించే వాహనాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

