వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్‌కతాలోని లేక్‌టౌన్ ప్రాంతంలో ఉన్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. ఇటీవల వీచిన ఈదురుగాలులకు విగ్రహం ఊగుతుండటంతో ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా పిడబ్ల్యూడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతేడాది డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే దీనిని పూర్తిగా తొలగించట్లేదని, మరో సురక్షిత ప్రాంతంలో పునఃప్రతిష్ఠిస్తామని తెలిపారు.
Comments
Loading comments...
