Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

91 మంది ఖైదీల విడుదల

Follow Udayam on Google
Rajdeep Sardesai Jun 02, 2026 5:41 PM హైదరాబాద్General
91 మంది ఖైదీల విడుదల - Udayam
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 91 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. వీరిలో 85 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. జైళ్ల నుంచి విడుదలైన వీరంతా సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఆకాంక్షించారు. విడుదలైన వారిలో 38 మంది జైళ్ల శాఖ పెట్రోల్ బంకుల్లో పనిచేయనుండగా, నలుగురు మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా ఈ క్షమాభిక్ష ప్రక్రియను పూర్తి చేసింది.

Comments

G
Loading comments...