Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి జైలు నుంచి 91 మంది విడుదల

Follow Udayam on Google
Vikram Singh Jun 02, 2026 5:39 PM హైదరాబాద్General
చర్లపల్లి జైలు నుంచి 91 మంది విడుదల - Udayam
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చర్లపల్లి జైలు నుంచి 91 మంది ఖైదీలు సత్ప్రవర్తనతో విడుదలయ్యారు. వీరిలో 85 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జైళ్ల శాఖ సహకారంతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. ఒకే ప్రభుత్వంలో ఇలా రెండుసార్లు విడుదల చేయడం అరుదని ఆమె పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఖైదీలకు లభించే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...