Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'పోలీస్ అక్క'కు స్కోచ్ అవార్డు.. నిర్మల్ పోలీసులకు గర్వకారణం

Follow Udayam on Google
సందీప్ Jul 12, 2026 11:10 AM నిర్మల్ General
'పోలీస్ అక్క'కు స్కోచ్ అవార్డు.. నిర్మల్ పోలీసులకు గర్వకారణం - Udayam
బాసర జోన్–2 డీఐజీ ఆర్. భాస్కరన్ శనివారం తొలిసారిగా నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల డీఐజీకి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మాదకద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్ తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.'పోలీస్ అక్క' కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు లభించడం జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...