వార్తలకు తిరిగి వెళ్లండి

దామరగిద్ద మండలం కాన్కుర్తిలో కనికె నర్సిములు, చంద్రమ్మ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని నాయకులు తెలిపారు. సర్పంచ్ నారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

