Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నన్నే బెదిరిస్తారా: పవన్ కల్యాణ్ ఆగ్రహం

Follow Udayam on Google
Priya Singh Jun 02, 2026 5:00 PM హైదరాబాద్General
నన్నే బెదిరిస్తారా: పవన్ కల్యాణ్ ఆగ్రహం - Udayam
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "హైదరాబాద్‌లో ఎలా కాలుపెడతావో చూస్తాం" అంటూ కొందరు తనను బెదిరిస్తున్నారని, అసలు తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదని తీవ్రంగా మండిపడ్డారు. భయపడేవాడైతే పార్టీ పెట్టేవాడిని కాదని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఇక్కడే పుట్టిందని, తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయాలకు అతీతమైందని పవన్ అన్నారు. తాను విభజన తీరును మాత్రమే వ్యతిరేకించానని చెప్పారు. తెలంగాణలో లక్ష మంది జనసైనికులు ఉన్నారని, గతంలో తండాల దాహార్తిని తీర్చినప్పుడు ఇప్పుడు విమర్శించే గొంతులు ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నించారు.

Comments

G
Loading comments...