వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా మందస మండలం, కిల్లోయి కాలనీ బాలికల ఉన్నత పాఠశాలను విలీనం చేయాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. బడిని కొనసాగించాలని కోరుతూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
విద్యార్థినుల సంఖ్య తక్కువగా ఉన్నందున పాఠశాలను మరో ప్రాంతానికి తరలించేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే, ఇది తమ పిల్లలకు దూరమవుతుందని, ప్రయాణంలో ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

