వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్‌పై పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

సింధూ జలాల ఒప్పందంపై భారత్ కఠినంగా వ్యవహరిస్తుండటంతో పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ నీటి వాటాను అడ్డుకోవాలని చూస్తే ఆ చేతులను నరికేస్తామంటూ ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని పక్కనపెట్టడంపై ఆయన స్పందించారు. ఈ అనాలోచిత వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను మరింతగా పెంచేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Loading comments...