వార్తలకు తిరిగి వెళ్లండి
క్రూయిజ్ షిప్‌లో 125 మందికి సోకిన నోరోవైరస్.

శాన్ ఫ్రాన్సిస్కో నుండి కెనడా వెళ్తున్న రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్ కలకలం సృష్టించింది. ఈ విలాసవంతమైన నౌకలో ప్రయాణిస్తున్న 125 మంది ప్రయాణికులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.
బాధితుల్లో తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి లక్షణాలు కనిపించాయని యూఎస్ అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నౌకలో పారిశుద్ధ్య చర్యలను సిబ్బంది ముమ్మరం చేశారు.
Comments
Loading comments...