Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

21 ఏళ్లలోపు వారికి గుట్కా వద్దు: నిజామాబాద్ సీపీ సూచన

Follow Udayam on Google
Nidhi Razdan Jun 04, 2026 2:34 PM నిజామాబాద్General
21 ఏళ్లలోపు వారికి గుట్కా వద్దు: నిజామాబాద్ సీపీ సూచన - Udayam
21 ఏళ్ల లోపు వారికి గుట్కా, పాన్ పరాగ్ వంటి మత్తు పదార్థాలను దూరంగా ఉంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజలను కోరారు. గురువారం మోపాల్ మండలం న్యాల్‌కల్‌లో జరిగిన గ్రామసభలో ఆయన ఈ పిలుపునిచ్చారు. గ్రామాల్లో నిషేధిత పదార్థాల విక్రయాలను అరికట్టాలని ఆయన సూచించారు. అలాగే, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...