వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా నగరి మండలం కాకవేడు ఎస్టీ కాలనీలో ఇద్దరు బాలికలు ఆత్మహత్యాయత్నం చేయగా మౌనిక (15) మృతి చెందింది. జీవిత (17) అపస్మారక స్థితిలో ఉండటంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చిన్నతనంలోనే తల్లులను కోల్పోయిన వీరిద్దరూ స్నేహితులుగా ఉండేవారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి సెల్ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

