Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి లడ్డూ విక్రయాల్లో సరికొత్త రికార్డు

Follow Udayam on Google
Richa Gupta Jun 03, 2026 2:16 PM తిరుపతిGeneral
శ్రీవారి లడ్డూ విక్రయాల్లో సరికొత్త రికార్డు - Udayam
గత మే నెలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. మొత్తం 1.21 కోట్ల లడ్డూలు అమ్ముడైనట్లు టీటీడీ వెల్లడించింది. గత రెండేళ్లతో (2024లో 1.01 కోట్లు, 2025లో 1.10 కోట్లు) పోలిస్తే ఈసారి విక్రయాలు భారీగా పెరిగాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేశారు. వీటి తయారీ కోసం రోజువారీగా 68 టన్నుల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారు. లడ్డూల నాణ్యత, రుచి పెరగడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...