వార్తలకు తిరిగి వెళ్లండి

భారత సరికొత్త పరుగుల వీరుడిగా గుర్విందర్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 100 మీటర్ల పరుగు పందెంలో కేవలం 10.09 సెకన్లలోనే రేసును పూర్తి చేశాడు. దీంతో 10.10 సెకన్ల కంటే తక్కువ సమయంలో లక్ష్యాన్ని చేరిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కాడు.
కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ రికార్డు మూడుసార్లు మారడం గమనార్హం. మొదట గుర్విందర్, ఆ తర్వాత అనిమేష్ కుజుర్ రికార్డులు తిరగరాయగా.. తుది పోరులో గుర్విందర్ అత్యంత వేగవంతమైన భారత రన్నర్‌గా నిలిచాడు.
Comments
Loading comments...

