వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాల్లో కీలక మార్పులు చేస్తూ పాత నిబంధనలను సవరించింది. ప్రస్తుతం ఉన్న పరిమాణాలకు అదనంగా కొత్తగా 150ml, 200ml సైజుల్లో కూడా మద్యం బాటిళ్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో ప్రకటించింది.
వినియోగదారుల అవసరాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయితే ఈ కొత్త సైజుల సీసాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, మద్యం ధరలలో ఎలాంటి మార్పులు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

