Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపు

Suhana Mehta Jun 17, 2026 2:03 AM జయ శంకర్ భూపాలపల్లి 5 viewsabout 3 hours ago
కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపు - Udayam Digital
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ కాళేశ్వర క్షేత్ర పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైందని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. శృంగేరి పీఠాధిపతి అనుమతితో రూపొందించిన ఈ ప్రాజెక్టులో భాగంగా, బుధవారం ఉదయం నుంచే నిర్మాణాల తొలగింపు పూజలు ప్రారంభం కానున్నాయి. సిఎం రేవంత్‌రెడ్డి క్షేత్రాభివృద్ధికి, అష్టతీర్థాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేశారు. రాబోయే గోదావరి పుష్కరాల కంటే నెల రోజులు ముందుగానే ఈ రాతి కట్టడాల పనులన్నీ పూర్తి చేసి, 25 వేల మంది భక్తులకు వసతులు కల్పిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...