వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి వైకుంఠపురంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ అనుపమ వెల్లడించారు.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటలకు అష్టోత్తర కలశాభిషేకం జరగనుంది. అలాగే సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ ప్రత్యేకంగా వరుణ జపం నిర్వహిస్తారు.
Comments
Loading comments...

