వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని ఓ ప్రైవేట్ వసతి గృహంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నందిని (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం ఉదయం వసతి గృహం వద్ద ఆమె మృతదేహాన్ని తోటి విద్యార్థులు గుర్తించి యాజమాన్యానికి సమాచారం అందించారు.
స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇది ఆత్మహత్యనా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

