వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు నెలల విరామం తర్వాత సోమవారం నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. నవంబర్ కోటాలో భాగంగా నల్లగొండ జిల్లాకు సుమారు 7 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారు. జిల్లాలోని 7.42 లక్షల కుటుంబాలకు పంపిణీ చేయనున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు నిఘా పెంచారు.
Comments
Loading comments...

