Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపు ప్రాంతాల్లో సొసైటీ ఛైర్మన్ పర్యటన

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 11:04 AM తూర్పుగోదావరి General
ముంపు ప్రాంతాల్లో సొసైటీ ఛైర్మన్ పర్యటన - Udayam
దేవరపల్లి గ్రామంలో తుఫాను ప్రభావంతో ముంపునకు గురైన ప్రాంతాల్లో సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరు రామారావు బుధవారం ఉదయం పర్యటించారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. ముంపు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా వెంటనే చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులకు సూచించారు. తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...