Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ మూగనున్న రీచార్జిల మోత

Follow Udayam on Google
sai Krishna Patel Jul 07, 2026 2:27 PM జాతీయంమార్కెట్
మళ్లీ మూగనున్న రీచార్జిల మోత - Udayam
టెలికం ఆపరేటర్లు రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచడానికి రెడీ అవుతున్నారు. రాబోయే 3–4 నెలల్లో టారిఫ్ ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. మార్కెట్లో గట్టి పోటీ కారణంగా ప్రస్తుతం ముగ్గురు ప్రైవేట్ ప్లేయర్లు, ప్రభుత్వ ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ మాత్రమే మిగలడంతో ధరల పెంపునకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.ఈ రిపోర్ట్ ప్రకారం.. జూన్ త్రైమాసికంలో ఒక యూజర్ నుంచి ప్రైవేట్ టెలికం ఆపరేటర్లకు వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) త్రైమాసిక ప్రాతిపదికన 1.5 శాతం వరకు పెరగడానికి అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో 2జీ నెట్వర్క్ నుంచి ఆధునిక 4జీ, 5జీ నెట్వర్క్ కు మారడం, కొత్తగా పోస్ట్పెయిడ్ కస్టమర్ల సంఖ్య పెరగడం, జూన్ క్వార్టర్లో ఎక్కువ పని దినాలు ఉండటంతో కంపెనీలకు భారీగా ఆదాయం రానుంది.

Comments

G
Loading comments...