వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో బుధవారం ఈ-వ్యర్థాల నిర్వహణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలను సాధారణ చెత్తలో వేయకుండా అధీకృత రీసైక్లింగ్ కేంద్రాలకు అందించాలని ప్రజలకు సూచించారు.
ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

