వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమెన్స్ ఏపీఎల్ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా వైజాగ్ ఫైర్ బర్డ్స్, రాయలసీమ జెన్ స్టార్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైజాగ్ ప్లేయర్ ఆయేషా ఔటైన అనంతరం రాయలసీమ ప్లేయర్ వాసవితో వాగ్వాదం జరిగింది. దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వెంటనే ఇరుజట్లకు చెందిన ఇతర ప్లేయర్లు కలగజేసుకొని వారిని సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.
Comments
Loading comments...

