వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంతతిని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులను ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిర్ణయం వన్యప్రాణుల సంరక్షణలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో కూడా ఇలాగే సహకరించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు.
Comments
Loading comments...

