Back to feed
మహారాష్ట్రలో కల్తీ మద్యం కల్లోలం
Priya Singh May 30, 2026 8:52 AM అల్ ఇండియా 16 viewsabout 10 hours ago

మహారాష్ట్రలో కల్తీ మద్యం సేవించి 14 మంది మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటనపై స్పందించిన పింప్రి-చించ్వాడ్ పోలీస్ కమిషనర్ వినయ్ కుమార్ చౌబే.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు పోలీసు అధికారులను శనివారం తక్షణమే సస్పెండ్ చేశారు.
మద్యం మాఫియా దందాను అరికట్టడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, నకిలీ మద్యం విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుల కుటుంబాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి.
Comments
Loading comments...


