వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి మండలాన్ని ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించింది. గతేడాది 22 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి వర్షాభావంతో 14 వేల ఎకరాలకే పరిమితమైంది. ఇప్పటికే వెయ్యి ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి.
అయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

