Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమనలో మృతదేహాలతో ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:56 AM ఆసిఫాబాద్General
ఖమనలో మృతదేహాలతో ఇబ్బందులు - Udayam
వాంకిడి మండలం ఖమన గ్రామంలో రోడ్డు పక్కన చెత్త, మేకల మృతదేహాలు పడేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున లక్ష్మీపూర్ రహదారి పక్కన మూడు మేకల మృతదేహాలు కనిపించాయి. గతంలోనూ ఇదే పరిస్థితి ఉందని గ్రామస్తులు తెలిపారు. వాగు వైపు వెళ్లే సమయంలో దుర్వాసన భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...