Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్‌లో అడవి పందుల దాడి.. వరి పంట ధ్వంసం

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:35 AM నిర్మల్ General
ఖానాపూర్‌లో అడవి పందుల దాడి.. వరి పంట ధ్వంసం - Udayam
ఖానాపూర్ మండలం సత్తెనపల్లి శివారులో రైతు లెక్కల రాజ్‌కుమార్‌కు చెందిన మూడెకరాల వరి పంట దెబ్బతింది. ఇటీవల భారీ వర్షాలకు పంట వరద నీటిలో మునిగి నేలకొరిగింది. ఆ నష్టం నుంచి కోలుకుంటున్న సమయంలో అడవి పందులు పంటపై దాడి చేశాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటను అడవి పందులు తొక్కి పూర్తిగా ధ్వంసం చేయడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...