వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్‌లో సరదాగా ఈతకు వెళ్లిన కార్తీక్ (25) అనే యువకుడు చెరువులో మునిగి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా పచ్చునూరుకు చెందిన ఇతను, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
భోజన విరామ సమయంలో స్నేహితులతో కలిసి ఎల్లమ్మ చెరువులోకి దిగి, నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో కార్తీక్ కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

