వార్తలకు తిరిగి వెళ్లండి

కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన కూచిపూడి జగనన్న కాలనీ సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన అమృతలూరి రమాదేవి(53) ఆదివారం తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై మండూరు వెళ్లి వస్తున్నారు.
మార్గమధ్యలో కూచిపూడి వద్ద వీరి బైకును ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Comments
Loading comments...

