వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు మండలం దేవాపూర్ రైతు దంపతులు తమ పంట పొలాలకు వెళ్లే దారి వివాదంపై వినూత్న నిరసన చేపట్టారు. అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఏకంగా ఎడ్లబండిపైనే కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యను అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌కు వివరించారు. స్పందించిన ఆయన, సమస్యను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్‌కు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు త్వరలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.
Comments
Loading comments...

