Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీఓ నెం. 396ను రద్దు చేయాలి: ఎమ్మెల్యే నల్లమిల్లికి దస్తావేజు లేఖరుల వినతి

Follow Udayam on Google
devendra Jul 20, 2026 5:37 PM తూర్పుగోదావరి General
జీఓ నెం. 396ను రద్దు చేయాలి: ఎమ్మెల్యే నల్లమిల్లికి దస్తావేజు లేఖరుల వినతి - Udayam
​రిజిస్ట్రేషన్ శాఖలో పీపీపీ విధానాన్ని తెస్తూ జారీ చేసిన జీఓ నెం. 396ను రద్దు చేయాలని బిక్కవోలు, అనపర్తి దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం అనపర్తి కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వారు వినతిపత్రం అందజేశారు. ఈ జీఓ వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ నెల 31 వరకు 'పెన్ డౌన్' నిరసన చేపట్టనున్నట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...