వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండల తీవ్రత దృష్ట్యా వచ్చే ఐపీఎల్ 2027 సీజన్‌ను మార్చి 10 నుంచి మే 15 మధ్యే నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. మే నెలలో వాతావరణ ఇబ్బందుల వల్ల ప్లేయర్లు, అభిమానులు పడే అవస్థలను తగ్గించేందుకు ఈ మార్పును పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
అయితే, ఐపీఎల్‌లో మ్యాచ్‌ల సంఖ్యను 74 నుండి 94కు పెంచుతారనే వార్తలను ఆయన కొట్టిపారేశారు. అంతర్జాతీయ సిరీస్‌ల వల్ల విదేశీ ఆటగాళ్ల లభ్యత కష్టమవుతుందని, ప్రస్తుతానికి మ్యాచ్‌ల సంఖ్యను పెంచే ఆలోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...
