వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు నుంచి నాగపూర్ వెళ్తున్న ఇండిగో విమానం శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలట్, వెంటనే అప్రమత్తమై శంషాబాద్ విమానాశ్రయ అధికారులను సంప్రదించారు.
అధికారులు ల్యాండింగ్‌కు తక్షణ అనుమతి ఇవ్వడంతో 126 మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డున పడ్డారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకోగా, పైలట్ చాకచక్యాన్ని అధికారులు అభినందించారు.
Comments
Loading comments...

