Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాలెక్కనున్న దేశీయ తొలి హైడ్రోజన్ రైలు

Follow Udayam on Google
Vikram Chandra May 29, 2026 4:25 PM జాతీయంGeneral
పట్టాలెక్కనున్న దేశీయ తొలి హైడ్రోజన్ రైలు - Udayam
భారతదేశపు మొట్టమొదటి దేశీయ హైడ్రోజన్ ఇంధన రైలు ప్రయాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ వ్యవస్థతో నడిచే ఈ రైలు, పైలట్ ప్రాజెక్టుగా హరియాణాలోని జీంద్ వేదికగా త్వరలోనే పరుగులు పెట్టనుంది. దీనికోసం అక్కడ రీఫ్యూయెలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి కొన్ని దేశాల్లోనే ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. ఇప్పుడు హరియాణాలో ఈ రైలు ప్రారంభం కావడంతో, పర్యావరణ హితమైన హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న అగ్ర దేశాల సరసన భారత్ చేరనుంది.

Comments

G
Loading comments...