వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ రెండో వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 171 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది.
భారత బ్యాటర్లలో రిచాఘోష్ (68) ఒంటరి పోరాటం చేసినా మిగతా వారు విఫలమవడంతో ఫలితం లేకపోయింది. అంతకుముందు ఇంగ్లాండ్ బ్యాటర్లు అమీ జోన్స్, డాని వ్యాట్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
Comments
Loading comments...

