వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా ప్రతినిధి సెర్గీ షోయిగుతో భేటీ అయ్యారు. బ్రిక్స్ వేదికపై రష్యా ప్రతిపాదించిన అంశాలపై ఇరుదేశాలు కీలక చర్చలు జరిపాయి.
భారత్-రష్యా మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు సమీక్షించారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
Comments
Loading comments...

