వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సంస్థ దశాబ్దం తర్వాత తొలిసారిగా పూర్తి ఆర్థిక సంవత్సరంలో లాభాలను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.15,200.75 కోట్ల ఆదాయంతో రూ.472 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది రూ.817 కోట్ల నికర నష్టం వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరం క్యూ4 లోనూ సంస్థ రూ.400.49 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఇదే త్రైమాసికంలో రూ.252.66 కోట్ల నష్టం రాగా, ఈసారి ఆదాయం కూడా రూ.4,042.90 కోట్లకు పెరగడం విశేషం.
Comments
Loading comments...

