Back to feed
హైదరాబాద్‌కు టెస్లా: 17న ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం
Rajdeep Sardesai Jun 12, 2026 6:54 AM హైదరాబాద్ 16 views3 days ago

ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది. ఈ నెల 17న హైటెక్ సిటీ నాలెడ్జ్ సిటీలోని ఆక్టేవ్ బ్లాక్‌లో దేశంలోనే ఐదవ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది.
ఈ సెంటర్‌లో 6 సీటింగ్ కెపాసిటీ, 88KWH బ్యాటరీ, డ్యూయల్ మోటార్ ఏడబ్ల్యూడీ ఫీచర్లతో కూడిన 'టెస్లా వై ఎల్' (లాంగ్-వీల్ బేస్) మోడల్ కారును ప్రదర్శించనున్నారు. కేవలం 5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకొనే ఈ కారు ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.61.99 లక్షలుగా నిర్ణయించారు.
Comments
Loading comments...



