వార్తలకు తిరిగి వెళ్లండి

యెమెన్‌లోని షబ్వా ప్రావిన్స్‌లో ప్రభుత్వ సైనిక శిబిరంపై హూతీ తిరుగుబాటుదారులు సోమవారం మూడు క్షిపణులతో దాడి చేశారు. ఈ ఘటనలో 53 మంది సైనికులు మృతి చెందగా, శిక్షణ పొందుతున్న మరో 200 మంది గాయపడ్డారు.
అల్-అలం శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి తగిన రీతిలో బదులిస్తామని షబ్వా ప్రభుత్వం ప్రకటించింది.
Comments
Loading comments...

