వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో భార్య (గృహిణి) మరణిస్తే, ఆమె అందించే గృహ సంరక్షణ సేవల నష్టానికి గానూ క్లెయిమ్‌లలో అదనంగా నెలకు కనీసం రూ.30,000 చొప్పున పరిహారం లెక్కించాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
మోటారు వాహనాల చట్టం కింద దాఖలైన ఓ కేసు విచారణలో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కె. సింగ్ ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గృహిణులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను విడిగా గుర్తించి ఈ పరిహారం అందించాలని కోర్టు స్పష్టం చేసింది.
Comments
Loading comments...
