వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ సహా పలు జిల్లాల్లో ఎండలు 45 నుంచి 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలోనూ తీవ్ర వడగాల్పులు వీస్తాయని APSDMA తెలిపింది.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
Comments
Loading comments...
