Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లిలో దంచి కొట్టిన భారీ వర్షం

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 5:09 PM మంచిర్యాలవాతావరణం
దండేపల్లిలో దంచి కొట్టిన భారీ వర్షం - Udayam
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పలు గ్రామాలలో అతి భారీ వర్షం నమోదయింది.ఆదివారం మ.2 గంటల ప్రాంతంలో దండేపల్లి మండల కేంద్రంతో పాటు గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం ఈదురు గాలుల మధ్య గంట పాటు భారీ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలోనే దండేపల్లి మండలంలో ఇప్పటివరకు అతి తక్కువ వర్షపాతం నమోదయింది. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడటంతో పాటు పంటలను కాపాడినట్లు అయిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...