వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గురు, శుక్రవారాల్లో దాదాపు 130 కి పైగా మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉంది.
మరోవైపు ద్రోణి ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

