వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు మండలం భీమునిపాదం వద్ద అటవీ శాఖకు చెందిన వేట సామగ్రి గదిలో చోరీ జరిగింది. వన్యప్రాణుల వేటకు ఉపయోగించే ఉచ్చులు, వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఇతర వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు సమాచారం. కిటికీలు, తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.
ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు బుధవారం గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

