Udayam Digital
Menu

గుకేశ్‌ ప్రిపరేషన్‌కు సిందరోవ్‌ ఫిదా

Sai Nath Nov 27, 2026 2:50 PM జాతీయంక్రీడలు
గుకేశ్‌ ప్రిపరేషన్‌కు సిందరోవ్‌ ఫిదా - Udayam Digital
ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ మూడో గేమ్‌లో భారత ఆటగాడు డి. గుకేశ్‌ ఓపెనింగ్‌ వ్యూహం తనను ఆశ్చర్యపరిచిందని ఉజ్బెకిస్థాన్‌ ఛాలెంజర్‌ జవోఖిర్‌ సిందరోవ్‌ తెలిపాడు. గుకేశ్‌ ఎంతో పక్కాగా సిద్ధమయ్యాడని, 15వ ఎత్తు వరకు అతడికి అన్నీ తెలుసని పేర్కొన్నాడు. దీంతో ఓపెనింగ్‌లో తాను ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. ఈ గేమ్‌ కూడా డ్రాగా ముగియడంతో మూడు గేమ్‌ల తర్వాత స్కోరు 1.5-1.5గా ఉంది.

Comments

G
Loading comments...