వార్తలకు తిరిగి వెళ్లండి
బాసర గోదావరిలో ఆత్మహత్యకు యత్నించిన కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన వృద్ధుడిని బాసర పోలీసులు కాపాడారు. అనారోగ్యంతో కుటుంబ సభ్యులను బాధ పెట్టలేననే ఆలోచనతో ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించారు.
గమనించిన టీజీఎస్పీ సిబ్బంది ముత్తయ్య, సాయికిరణ్, యశ్వంత్ వెంటనే నదిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Loading comments...

