వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో కస్టమర్లు తాకట్టు పెట్టిన 96 బంగారు ప్యాకెట్లు అదృశ్యమయ్యాయి. కీలక అధికారి విధులకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది, స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేయగా బంగారం మాయమైనట్లు గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మాజీ బ్రాంచ్ మేనేజర్ సహా ముగ్గురు అధికారులను అనుమానితులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ ఆదిత్య లాంగే వెల్లడించారు.
Comments
Loading comments...

