వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.223 తగ్గి రూ.15,606గా, 22 క్యారెట్ల బంగారం రూ.14,305గా నమోదైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య బులియన్ మార్కెట్లలో ధరలు నేలచూపులు చూస్తున్నాయి.
వెండి ధర కూడా భారీగా పడిపోయింది. దేశవ్యాప్తంగా కేజీకి రూ.10 వేలు తగ్గడంతో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.2,85,000లకు చేరింది. గ్రాము వెండి సుమారు రూ.285 వద్ద లభిస్తోంది. కొనుగోలుదారులు స్థానిక మార్కెట్ ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
Comments
Loading comments...

